తన వివాహ వేడుకను ఇంత ఘనంగా, వైభవంగా నిర్వహించిన తల్లిదండ్రులకు, ఆప్తులకు కృతజ్ఞతలు తెలియజేసింది బాలీవుడ్ నటి..అనిల్‌కపూర్ తనయ సోనమ్‌కపూర్. ఈ సందర్భంగా తన ఇన్స్టామ్గ్రామ్లో ఒక మెసేజ్‌ను పోస్టు చేసింది. మా వివాహన్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రెండురోజుల ఈ వేడుక మా జీవితంలో ఎంతో ముఖ్యమైనది. దీన్ని ఇంత అద్భుతంగా మలచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పింది. అలానే కుటుంబాన్ని ఉద్ధేశించి మరో పోస్టులో మా కుటుంబమే మా బలం. కపూర్ కుటుంబ సభ్యులందరికి చాలా ధన్యవాదాలు. సునీత నువ్వు ఈ ప్రపంచంలోనే అందరికంటే మంచి అమ్మవి. నాన్న నువ్వు నన్ను, ఆనంద్‌ను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావ్…మీ ప్రేమకు, మద్దతకు చాలా ధన్యవాదాలని తెలిపింది.