బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేశారు. 40 ఏళ్లకు పైబడిన వయసున్న ఐష్ యంగ్ జనరేషన్‌కు గట్టిపోటీ ఇస్తూ అందంలో తాను ఎవరికీ తీసిపోను అని మరోసారి నిరూపించారు. సీతాకోక చిలుకు థీమ్‌తో ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్సులో ఐశ్వర్యరాయ్ మోస్ట్ బ్యూటిఫుల్ లుక్‌లో మెరిసిపోయింది. ఐష్‌తో పాటు కూతురు ఆరాధ్య కూడా ఈ వేడుకలో సందడి చేశారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ మాజీ ప్రపంచ సుందరి పాల్గొనడం ఇది 17వ సారి.కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఐశ్వర్యరాయ్ వేసుకున్న సీతాకోక చిలుకు థీమ్ డ్రెస్ ప్రముఖ ఇంటర్నేషనల్ డిజైనర్ మైఖేల్ సింకో డిజైన్ చేశారు. ఈ డ్రెస్సులో ఆమె మరింత గ్లామరస్‌గా కనిపించారు.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఐశ్వర్యరాయ్‌తో పాటు ఆమె కూతురు ఆరాధ్య కూడా సందడి చేశారు. హోటల్ నుండి బయటకు వస్తూ ఇద్దరూ కెమరాకు చిక్కారు. బాలీవుడ్ మోస్ట్ హాటెస్ట్ మామ్ అంటూ ఐష్ మీద ప్రశంసల వర్షం కురుస్తోంది.అనేక పర్యాయాలు ఐష్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేశారు. ఇప్పటికీ ఆమెకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అప్పుడూ... ఇప్పుడూ ఏళ్ల తరబడి ఆమెపై అదే అటెన్షన్ కంటిన్యూ అవుతోంది.ఐశ్వర్యరాయ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మొత్తానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని, ఆమె రాకతో ఫిల్మ్ ఫెస్టివల్‌కు కొత్త శోభ వచ్చిందని అంటున్నారు ఫ్యాన్స్.కేవలం అందం మాత్రమే కాదు... తన చూపులతో అందరినీ కట్టిపడేసింది ఈ అందాల సుందరి.