ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'టాక్సీవాలా'....జూన్ లో ప్రేక్షకుల ముందుకు

cinema |  Suryaa Desk  | Published : Mon, May 14, 2018, 05:10 PM



విజయ్ దేవరకొండ హీరోగా 'టాక్సీవాలా' చిత్రం రూపొందింది. రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సైంటిఫిక్ థ్రిల్లర్ గా ఈ కథ కొనసాగుతుంది. ఈ సినిమాను ఈ నెల 18వ తేదీన విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఆ రోజున ఈ సినిమా థియేటర్లకు రావడం లేదని విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.


ఈ సినిమాకి సంబంధించిన పనులు ఇంకా పూర్తి కాలేదనీ, అందువలన విడుదల తేదీని వాయిదా వేయవలసి వచ్చిందని అన్నాడు. జూన్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామనీ, తేదీ ఎప్పుడనేది త్వరలో ప్రకటిస్తామని చెప్పాడు. గీతా ఆర్ట్స్ 2 .. యూవీ క్రియేషన్స్ బ్యానర్ వారు సమర్పిస్తోన్న ఈ సినిమాలో, మాళవిక శర్మ .. ప్రియాంక కథానాయికలుగా కనిపించనున్నారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com