టాలీవుడ్ యాక్టర్ రామ్ నటిస్తోన్న తాజా చిత్రం హలో గురు ప్రేమ కోసమే. త్రినాథరావు నక్కిన డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ రామ్‌కు జోడీగా కనిపించనుంది. చిత్రయూనిట్ రేపు రామ్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ..హలో గురు ప్రేమ కోసమే ఫస్ట్ లుక్‌ను రివీల్ చేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్లో అనుపమ చేతిలో ఐడీ కార్డు, బుక్ పట్టుకుని వెళ్తుంటే..రామ్ అనుపమను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది. ఉన్నది ఒక్కటే జిందగీ మూవీ తర్వాత రామ్, అనుపమ కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను సెప్టెంబర్‌లో ఆడియెన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మిస్తున్నారు.