ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరుణ్ తేజ్ కొత్త లుక్ అదిరింది

cinema |  Suryaa Desk  | Published : Tue, May 15, 2018, 12:49 PM



‘ఫిదా, తొలిప్రేమ’ లాంటి వరుస బ్లాక్ బస్టర్లు అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘ఘాజి’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. స్పేస్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ అంతరిక్ష వ్యోమగామి పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ఆయన క్లీన్ షేవ్ తో పాటు బాడీ షేప్ చేసి డాషింగా కనిపిస్తున్నారు.


2015లో వచ్చిన ‘కంచె’ సినిమాలో సీరియస్ లుక్లో కనబడిన వరుణ్ మళ్ళీ ఇప్పుడు అలాంటి లుక్లో కనిపిస్తుండటంతో సినిమాపై అంచనాలు రెట్టింపవుతున్నాయి. అంతేగాక సంకల్ప్ తొలి సినిమాతోనే జాతీయ స్థాయి గుర్తింపు పొంది ఉండటం, ఇప్పటి వరకు ఇండియాలో అంతరిక్ష నైపథ్యంలో సినిమాలు రూపొందకపోవడంతో తెలుగు ప్రేక్షకుల్లో చిత్రం ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి నెలకొంది. దర్శకుడు క్రిష్, రాజీవ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అదితిరావ్ హైదరి, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com