తెలుగు రియాలిటీ షో గా ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ‘బిగ్ బాస్’ కార్యక్రమం సూపర్ హిట్..దీంతో రెండో సీజన్ ను త్వరలో ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. క్రితం సారి ముంబై సమీపంలో చేసిన ఈ కార్యక్రమాన్ని, ఈ సారి అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో చేయనున్నారు. ఈ సారి ఈ కార్యక్రమానికి ‘నాని’ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. హీరో తరుణ్, హీరోయిన్ తేజస్వి మదివాడ, సింగర్ గీతామాధురి తదితరుల ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇటీవలే లోగోను రిలీజ్ చేసిన నిర్వాహకులు, త్వరలో ప్రోమోను విడుదల చేయనున్నారు