ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆయనే నాకు ఇష్టమైన నటుడు: ఐష్‌

cinema |  Suryaa Desk  | Published : Thu, May 17, 2018, 02:31 PM



 మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్‌ను ఇష్టపడని వారుండరు. ఆమెతో కలిసి ఒకసారైనా నటించాలని నటీనటులంతా కోరుకుంటారు. మరి అలాంటి ఐష్‌కి ఇష్టమైన నటుడెవరో తెలుసా? ఇంకెవరు తన భర్త అభిషేక్‌ బచ్చనే. ఈ విషయాన్ని ఐష్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.


‘నాకు ఇష్టమైన నటుడు నా భర్త అభినే. మేమిద్దరం జంటగా నాలుగైదు సినిమాల్లో నటించాం. అభి సినిమాల్లో సాధారణ వ్యక్తిలాగే కన్పిస్తాడు. స్టార్ కుమారుడు అయినప్పటికీ ఆ గర్వం ఉండదు. ముక్కుసూటి మనిషి. అదే అభిలో నాకు నచ్చిన విషయం. అభి నా మనిషి. ఇప్పటికీ మా ఇద్దరినీ సినిమాలో తీసుకోవడానికి దర్శకులు మంచి స్క్రిప్ట్‌లతో వస్తున్నారు. ఇద్దరం ఓ సినిమా చేయబోతున్నాం. దాని వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’ అని పేర్కొన్నారు ఐష్‌.


ఇటీవల ఐష్‌ కేన్స్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో తన కుమార్తె ఆరాధ్యతో కలిసి మెరిశారు. తల్లీకూతుళ్లిద్దరూ ఆ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఐష్‌ ఆ వేడుకను ముగించుకుని ఇటీవల ముంబయి చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె‌ ‘ఫ్యానే ఖాన్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆమెకు జోడీగా రాజ్‌కుమార్‌ రావ్‌, అనిల్‌ కపూర్‌ నటిస్తున్నారు. మరోపక్క అభి ‘మన్మర్జియా’ చిత్రంతోనూ బిజీగా ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com