ఆ రోజుల్లో బాలీవుడ్ నటి మాధురిదీక్షిత్లాంటి అందమైన భార్య కావాలని కోరుకోని అబ్బాయిలు ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటిది ఆమె తల్లిదండ్రులే స్వయంగా వచ్చి ‘మా అమ్మాయిని పెళ్లిచేసుకుంటారా అని అడిగితే అందుకు నిరాకరించాడు ఓ వ్యక్తి. అంతటి అందమైన నటిని ఎందుకు వదులుకున్నాడో? అనేగా మీ సందేహం. అసలు విషయమేంటంటే..అవి మాధురి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలిరోజులు. అందరు తల్లిదండ్రుల్లాగే మాధురి అమ్మానాన్నలు కూడా ఆమెకు త్వరగా పెళ్లిచేయాలనుకున్నారు. సినిమాల గొడవలో పడి ఎక్కడ ఆమెకు సరైన సంబంధం దొరకదోనని బాధపడేవారు. ఎలాగైనా మాధురికి పెళ్లి చేయాలని తన తల్లిదండ్రులు సురేశ్ వడ్కార్ అనే బాలీవుడ్ గాయకుడితో సంబంధం కుదుర్చుకోవాలనుకున్నారట. కానీ అతను పెళ్లికి ఒప్పుకోకపోవడంతో వారు కంగుతిన్నారు. ఆయన పెళ్లికి ఒప్పుకోకపోవడానికి కారణం అప్పట్లో మాధురి సన్నగా ఉండడమేనట. దాంతో మాధురి విషయంలో ఆమె తల్లిదండ్రులు మరింత ఒత్తిడికి లోనయ్యారు.