నయనతార- విఘ్నేష్ శివన్‌ల మధ్య ప్రేమాయణం నడుస్తుందని కొన్నాళ్ళుగా వార్తలు వస్తున్నా, దీనిపై పూర్తి క్లారిటీ రావడం లేదు. అప్పుడప్పుడు టూర్స్‌లో దిగిన ఫోటోస్‌తో తమ మధ్య రిలేషన్ నడుస్తుందనే హింట్ ఇస్తున్నప్పటికి, ఈ ఇద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అనే దానిపై పూర్లి క్లారిటీ లేదు. అయితే నానుమ్ రౌడీ దాన్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరి ఫోటోలని షేర్ చేస్తూ కోకో( కోలమావు కోకిల) మూవీలోని ఎనక్కు కల్యాణ వయసు సాంగ్ ఫస్ట్ లైన్‌ని కామెంట్‌గా రాసాడు. రైట్ సాంగ్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్, లిరిసిస్ట్ శివకార్తికేయన్‌కి ధన్యవాదాలు తెలిపాడు విఘ్నేష్ శివన్. పబ్లిక్ ఫ్లాట్‌ఫాంలో ఎనక్కు కల్యాణ వయసు సాంగ్‌తో విఘ్నేష్ శివన్ ఇచ్చిన రియాక్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో కోకో( కోలమావు కోకిల) అనే చిత్రం తెరకెక్కుతుండగా, లైకా ప్రొడక్షన్ బేనర్‌పై బ్లాక్ కామెడీ కథా చిత్రంగా ఈ మూవీ రూపొందుతుంది. ఇందులో నటుడు యోగిబాబు ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. లేడి ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రేక్షకులని తప్పక అలరిస్తుందని యూనిట్ చెబుతుంది. చిత్ర శాటిలైట్ రైట్స్, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ తో పాటు ఆడియో రైట్స్ ని భారీ రేటుతో జీ నెట్ వర్క్ దక్కించుకోవడం విశేషం.