ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'రేస్ 3' బి.టి.ఎస్ వీడియో

cinema |  Suryaa Desk  | Published : Sun, May 20, 2018, 12:43 PM



బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న చిత్రం రేస్3. ఈ చిత్రంలో సల్మాన్ సరసన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్‌గా నటిస్తుండగా... అనిల్ కపూర్, డైసీ షా, బాబీ డియోల్, సాఖీబ్ సలీమ్, ఫ్రీడీ దరువాలా ముఖ్య పాత్రల్లో నటించారు. రంజాన్ కానుకగా జూన్ 15, 2018 న మూవీని రిలీజ్ చేస్తున్నారు. బాలీవుడ్‌లో రేస్ సీక్వెల్స్ సూపర్ డూపర్ హిట్‌ కాగా తాజాగా రేస్3 పై భారీ అంచనాలు ఉన్నాయి. రెమో డిసౌజా దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఇటీవ‌ల చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల కాగా, ఈ ట్రైల‌ర్ ఒక్కరోజులోనే కోట్ల వ్యూస్‌ను సొంత చేసుకోవడమే కాకుండా యూట్యూబ్‌లో నెంబర్ వన్ ట్రెండింగ్ అయింది. ఈ సినిమాతో స‌ల్మాన్ త‌న అభిమానుల‌కి ప‌సందైన విందు అందిస్తాడ‌ని అంటున్నారు. అయితే చిత్ర రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మేక‌ర్స్ మూవీకి సంబంధించి ప‌లు వీడియోలు షేర్ చేస్తూ సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తున్నారు. తాజాగా రేస్ 3 బిహైండ్ ది సీన్స్ వీడియో షేర్ చేశారు. ఇది ఫ‌న్‌తో కూడిన యాక్ష‌న్ ప్యాక్డ్‌గా క‌నిపిస్తుంది. మీరు ఆ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.







 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com