పోరాట యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పవన్‌ని అభిమానించే ఆరేళ్ళ చిన్నారి రేవతి కొంత కాలంగా మస్క్యూలర్ డిస్ట్రోఫీ వ్యాధితో బాధపడుతుంది. ఎప్పటికైన తన అభిమాన హీరో పవన్‌ని కలవాలని చిన్నారి కోరిక కాగా, ఈ విషయాన్ని పవన్ తన టీం ద్వారా తెలుసుకున్నాడు. వెంటనే పాప ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆసుపత్రికి వెళ్లి అక్కడ పాపని ఒళ్ళో కూర్చోబెట్టుకొని సరదాగా మాట్లాడారు. పాపకు బ్యాటరీతో నడిచే వీల్ చైర్ అవసరమని డాక్టర్స్ చెప్పడంతో ఆ వీల్ చైర్ తాను ఏర్పాటు చేస్తానని అన్నాడు. అంతేకాదు వైద్యానికి అవసరం అయ్యే ఆర్ధిక సాయం కూడా తాను అందిస్తానని హామీ ఇచ్చాడు. పవన్ తన కూతురి కోరిక తీర్చడమే కాక సాయం అందిస్తానని మాట ఇవ్వడంతో పాప తల్లితండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. పవన్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గతంలోను పవన్ కళ్యాన్ ఆపదలో ఉన్న అభిమానులకి సాయం అందించి తన మానవత్వం చాటుకున్న సంగతి తెలిసిందే.