రామ్గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి ఆర్ఎక్స్ 100 పేరుతో ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. కార్తికేయ, పాయల్ రాజ్పుత్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్నారు. ఆర్ఎక్స్ 100 ఒక జనరేషన్ ఫేవరేట్ బైక్. దీని ధ్వని డిఫరెట్గా ఉంటుంది. బైక్ పేరునే సినిమాకు ఎందుకు పెట్టామనేది తెలియాలంటే జూన్లో రిలీజ్ అయ్యే సినిమాలో చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు. రావు రమేష్, సింధూరపువ్వు రామ్ ఇందులో కీలక పాత్రధారులు ఈ చిత్రానికి సంగీతం చైతన్ భరద్వాజ్, ఛాయాగ్రహణం రామ్. కాగా ఈ మూవీ టీజర్ ను రేపు చిత్ర యూనిట్ విడుదల చేయనుంది.