ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సస్పెన్స్ థ్రిల్లర్‌గా 'లా'

cinema |  Suryaa Desk  | Published : Tue, May 22, 2018, 12:12 PM



సమాజంలో ప్రతీ మనిషి చట్టం, న్యాయానికి లోబడే జీవించాలి. అలా జీవించడం లేదంటే జరిగే మలుపులు ఎలా ఉంటాయన్న కథాంశంతో లా చిత్రం రూపొందుతోంది. దీనికి లవ్‌ అండ్‌ వార్‌ అన్నది ఉపశీర్షిక. కమల్‌ కామరాజ్‌, మౌర్యాణి, పూజారామ చంద్రన్‌ ప్రధాన పాత్రధారులు. గగన్‌ గోపాల్‌ ముల్క దర్శకుడు. రమేష్‌బాబు మున్నా నిర్మిస్తున్నారు. పూర్తిస్థాయి క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ పార్ట్‌ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదలచేశా రు. హీరో కమల్‌ కామరాజ్‌ మాట్లాడుతూ, దర్శకుడు గగన్‌ గోపాల్‌ మంచి కథ చెప్పారు. ఇందులోని కొన్ని ట్విస్ట్‌లు ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేస్తాయి. టైటిల్‌ కూడా కథలో అంతర్భాగంగా వచ్చిందే అని అన్నారు. కథానాయిక మౌర్యాణి మాట్లాడుతూ, తెలుగులో తాను నటిస్తున్న ఏడవ చిత్రమిదని, నటనకు అవకాశం ఉన్న పాత్రను చేశానని అన్నారు. దర్శకుడు గగన్‌గోపాల్‌ మాట్లాడుతూ, మంటి ట్విస్ట్‌లతో ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించే విధంగా ఈ చిత్రం ఉంటుందని చెప్పారు. సత్య కశ్యప్‌ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలంగా మారిందని అన్నారు. ఇంకా పలువురు చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com