ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్టీఆర్ సరసన ఈషా రెబ్బా

cinema |  Suryaa Desk  | Published : Tue, May 22, 2018, 02:07 PM



మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించే సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇటీవలే రెగ్యులర్ షూటింగును ఆరంభించిన ఈ సినిమాకి, 'అరవింద సమేత వీర రాఘవ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్‌తో కనిపించనుండటం విశేషం. ఈ సినిమా తొలి అర్థభాగంలో ఎన్టీఆర్ కుటుంబ బంధాలకి విలువనిచ్చే సాఫ్ట్ కేరక్టర్‌లో కనిపిస్తాడట. అయితే ఆయన ఫ్లాష్ బ్యాక్ మాత్రం ఆసక్తిని రేకెత్తించే యాక్షన్‌తో కూడినదిగా ఉంటుందని టాక్. డిఫరెంట్ షేడ్స్‌లో ఎన్టీఆర్ ఈ సినిమాలో దుమ్మురేపుతాడని సమాచారం. ఎన్టీఆర్‌కి జోడీగా పూజా హెగ్డే నటిస్తోన్న సంగతి తెలిసిందే. 


 తాజాగా ఈ సినిమాలో అచ్చతెలుగమ్మాయికి అవకాశం లభించింది. ఎక్కడా గ్యాప్ లేకుండా ముందుగా వేసుకున్న షెడ్యూల్స్ ప్రకారం షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఎన్టీఆర్ రాయలసీమ యాసలో మాట్లాడే ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. కథ ప్రకారం మరో హీరోయిన్ కూడా అవసరం కావడంతో, తెలుగు బాగా మాట్లాడే హీరోయిన్ కోసం త్రివిక్రమ్.. ఈషా రెబ్బాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 


అమీ తుమీలో చేసిన తెలుగమ్మాయి ఈషా రెబ్బా అయితే ఈ రోల్‌కు చక్కగా సరిపోతుందని త్రివిక్రమ్ భావించారట. ఇక ఈషా రెబ్బాకు ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం రావడంతో ఎగిరి గంతేసిందట






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com