ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్యాంగ్ స్టార్ గొడవలు

cinema |   | Published : Tue, May 22, 2018, 04:53 PM



టాలీవుడ్ మార్పులు వస్తున్నాయ్ అంటే ఏమో అనుకున్నాం గాని అర్జున్ రెడ్డి స్థాయిలో వస్తాయి అని అనుకోలేదు. బూతు పదాలు డైలుగులుగా మారితే ఆడియెన్స్ కి నచ్చుతాయని సినిమావాళ్లకు బాగా తెలిసింది. అందుకే వీలైనంత వరకు తెగ వాడేస్తున్నారు. మాట నుంచి సబ్ లైన్స్ వరకు వచ్చాయి. ఇక మరొక వెరైటీ వెబ్ సిరీస్ తో కొంత మంది ప్రముఖ నటులు సరికొత్త టేస్ట్ ను ఆడియెన్స్ ముందుకు తీసుకురానున్నారు.


అమెజాన్ ప్రైమ్ లో గ్యాంగ్ స్టార్ అనే వెబ్ సిరీస్ రానున్న సంగతి తెలిసిందే. మొన్న టీజర్ రిలీజ్ చేయగా ఈ రోజు ట్రైలర్ ని రిలీజ్ చేశారు. కొంచెం నార్మల్ గానే అనిపించినా కూడా ఆర్టిస్ట్ ల నటన కొంచెం కొత్తగా అనిపించినట్లు అనిపిస్తుంటుంది. జగపతి బాబు - నవదీప్ - శివాజీ అలాగే శ్వేతా బసు ప్రసాద్ విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. చూస్తుంటే ఈ వెబ్ సిరీస్ ఒక సినిమా షూటింగ్ నేపథ్యంలో తెరకెక్కినట్లు అనిపిస్తోంది.


గ్యాంగ్ స్టర్ కు అలాగే సినీ తరాలకు సంబందించిన వివాదాలు ఇందులో ప్రధానంగా కనిపిస్తున్నాయి. ప్రతి పాత్ర యొక్క పని తీరును పరిచయం చేశారు. జూన్ 1న విడుదల కాబోయే ఈ వెబ్ సిరీస్ కు అజయ్ భుయాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ దర్శకుడు ఇంతకుముందు నాగ చైతన్య తో దడ సినిమా చేశాడు. ఇక ఈ గ్యాంగ్ స్టార్ మొత్తం 13 ఎపిసోడ్స్  ఉంటుంది. అలాగే నందిని రెడ్డి కూడా కొన్ని ఎపిసోడ్స్ కి దర్శకత్వం వహించనున్నారు.  











SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com