ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గర్భం దాల్చడం వల్లే హీరోయిన్ రహస్య వివాహం?

cinema |  Suryaa Desk  | Published : Wed, May 23, 2018, 02:37 PM



బాలీవుడ్ బ్యూటీ నేహా ధూపియా ఇటీవల రహస్య వివాహం చేసుకుని అభిమానులకు, ప్రేక్షకులకు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన బాయ్ ఫ్రెండ్, బాలీవుడ్ నటుడు అంగద్ బేడీని ఆమె పెళ్లాడారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఫ్యాన్స్ ఆమెను విష్ చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేయగా... కొందరు చెత్త కామెంట్లతో ఆమెను టార్గెట్ చేశారు. పెళ్లికి ముందే నేహా ధూపియా గర్భం దాల్చిందని, అందుకే ఇలా ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకుందంటూ కామెంట్స్ చేశారు. ఈ ఆరోపణలపై స్పందించడానికి నేహా, అంగద్ ఇష్టపడలేదు. అయితే నేహా తండ్రి ప్రదీప్ ధూపియా స్పందించారు.ఈ వార్తలపై నేహా ధూపియా తండ్రి ప్రదీప్ ధూపియా స్పందిస్తూ..... అలాంటిదేమీ జరుగలేదని, పెళ్లికి ముందే నేహా గర్భం దాల్చింది అనే వార్తల్లో నిజం లేదన్నారు. కొందరు ఏదో ఊహించుకుని ఇష్టం వచ్చినట్లు రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారని మండి పడ్డారు.సమయం లేక పోవడం హడావుడి లేకుండా, ఎవరికీ చెప్పకుండా కేవలం ఇరు కుటుంబాల సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగిందని ప్రదీప్ ధూపియా తెలిపారు. వారి వారి వర్క్ కమిట్మెంట్స్ వల్లనే రెండు రోజుల్లో అన్ని ఏర్పాట్లు చేసి పెళ్లి తంతు ముగించామని తెలిపారు.నేహా ధూపియా, అంగద్ బేడీ రిలేషన్ గురించి కుటుంబ సభ్యులకు ముందే తెలుసట. ‘నేహా, అంగద్ గుండ్ ఫ్రెండ్స్. వారు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో అని మేము ఎప్పటి నుండే వెయిట్ చేస్తున్నాం. ఎట్టకేలకు వారే స్వయంగా మా అనుమతి కోరారు. వెంటనే అంతా ఓకే చేశాం' అని ప్రదీప్ ధూపియా తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com