ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘తేజ్ ఐ ల‌వ్ యు’ షూటింగ్ పూర్తి

cinema |  Suryaa Desk  | Published : Thu, May 24, 2018, 02:06 PM



సాయిధరమ్‌ తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్న చిత్రం తేజ్‌ ఐ లవ్‌ యు. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో కె.ఎస్‌.రామారావు, వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ప్యారిస్‌లో చిత్రీకరించిన రెండు పాటలతో షూటింగ్‌ మొత్తం పూర్తిచేశారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. జూన్‌ 29న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


ఇతర పాత్రల్లో జయప్రకాష్‌, పవిత్రా లోకేష్‌, పృథ్వీ, సురేఖావాణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్‌, ఛాయాగ్రహణం ఆండ్రూ, మాటలు డార్లింగ్‌ స్వామి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com