ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాబోయే సినిమాలు పేరు తెచ్చి పెట్టేవే

cinema |  Suryaa Desk  | Published : Sat, May 26, 2018, 10:45 AM



తెలుగు, తమిళ సినీరంగాలలో ఎక్కడ మంచి అవకాశాలు లభిస్తే అక్కడి సినిమాలకు పచ్చజెండా ఊపుతోంది సమంత. మొదట్నుంచి కొనసాగిస్తున్న అదే సంప్రదాయాన్ని వివాహానంతరమూ అనుసరిస్తోంది. రంగస్థలం, మహానటి చిత్రాలతో ఆమెకు మరింత పేరొచ్చింది. తమిళంలో విశాల్‌ సరసన నటించిన ఇరుంబు తిరై చిత్రం కూడా విజయవంతం కావడం ఆమెలో ఎనలేని ఉత్సాహాన్ని నింపింది. కథ, అందులోని పాత్ర నచ్చిన తర్వాతే ఏ సినిమా అయినా అంగీకరిస్తున్న ఆమె రాబోయే మూడు చిత్రాలు కూడా తనకు పేరు తెచ్చిపెట్టేవేనని, వాటిపై తనకెంతో నమ్మకం ఉందని అంటోంది. శివకార్తికేయన్‌, దర్శకుడు పొన్‌రామ్‌ల కలయికలో రూపొందుతున్న సీమరాజా చిత్రం ఒక ఊరు ఇతివృత్తంగా మలచబడుతోందని, ఈ చిత్రం మొత్తం తాను లంగా ఓణీతోనే కనిపిస్తానని ఆమె వెల్లడించింది. పైపెచ్చు ఈ చిత్రం కోసం తాను కర్రసామును నేర్చుకుని నటించానని, ఇది చాలా మంచి అనుభవమని ఆమె చెప్పుకొచ్చారు. ఇకపోతే విజయ్‌సేతుపతికి జంటగా త్యాగరాజన్‌ కుమారరాజా దర్శకత్వంలో నటిస్తున్న సూపర్‌డీలక్స్‌ చిత్రం కూడా అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుందని చెబుతున్న ఆమె కన్నడంలో విజయవంతమైన యూటర్న్‌ చిత్రం రీమేక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇలా ఈ మూడు చిత్రాలు వేటికవే విభిన్నమైనవి, వైవిధ్యభరితమైనవని అంటూ వాటికోసం తాను ఎదురు చూస్తున్నానని అంటోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com