బాలీవుడ్ నటి, రజినీకాంత్‌కు జంటగా ‘లింగా’లో నటించిన సోనాక్షిసిన్హా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేశారు. తన బరువుపై వస్తున్న కామెంట్లకు స్పందించిన సోనాక్షి ఫిట్‌నెస్‌పై మరింత శ్రద్ధ వహిస్తున్నారు. కండల వీరుడు సల్మాన్‌తో ‘దబాంగ్-3’లో అవకాశం దక్కించుకున్నసోనాక్షి.. న్యూలుక్లో కనిపిస్తున్నారు. ‘దబాంగ్’ మూడు సిరీస్‌లలో సోనాక్షీనే హీరోయిన్ కావడం విశేషం. సోనాక్షి ప్రతీరోజూ జిమ్‌కు వెళుతుంటారు. లిమిటెడ్ డైట్ పాటిస్తుంటారు. ఇటీవలే ఆమె 35 కిలోల బరువు తగ్గారు. 2010లో ‘దబాంగ్’లో నటించినపుడు సోనాక్షి 90 కిలోల బరువు ఉండేవారు. తరువాత 30 కిలోల బరువు తగ్గారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘నేను ఎక్సర్ సైజ్ చేయడంతోపాటు జిమ్‌కు వెళ్లే సందర్భంగా ఎప్పుడూ నా బరువు చెక్చేసుకోలేదు. తరువాత నేను మెల్లమెల్లగా బరువు తగ్గుతున్నట్టు నాకు అనిపించిందని’ తెలిపారు.