ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెంకటేశ్ సరసన నయనతార ?

cinema |  Suryaa Desk  | Published : Sat, May 26, 2018, 03:46 PM



వెంకటేశ్ .. నాగచైతన్య కథానాయకులుగా దర్శకుడు బాబీ ఒక భారీ మల్టీ స్టారర్ కి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ చివరిదశకు చేరుకుంది. త్వరలోనే నటీనటుల ఎంపిక ప్రక్రియను మొదలు పెట్టనున్నారు. ఈ క్రమంలో ముందుగా కథానాయికల ఎంపికను పూర్తి చేశారు. వెంకటేశ్ సరసన నయనతారను .. చైతూ జోడిగా రకుల్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది.వెంకటేశ్ .. నాగచైతన్య కథానాయకులుగా దర్శకుడు బాబీ ఒక భారీ మల్టీ స్టారర్ కి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ చివరిదశకు చేరుకుంది. త్వరలోనే నటీనటుల ఎంపిక ప్రక్రియను మొదలు పెట్టనున్నారు. ఈ క్రమంలో ముందుగా కథానాయికల ఎంపికను పూర్తి చేశారు. వెంకటేశ్ సరసన నయనతారను .. చైతూ జోడిగా రకుల్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది.గతంలో వెంకటేశ్ .. నయనతార కాంబినేషన్లో వచ్చిన లక్ష్మి .. తులసి .. బాబు బంగారం సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ జోడీకి మంచి క్రేజ్ ఉండటంతో కథానాయికగా నయనతారను సంప్రదించారట. త్వరలోనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాలో చైతూ జోడీగా రకుల్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. అందువలన ఆయన జోడీగా ఆమెను ఎంపిక చేసుకున్నారు. భరత్ చౌదరి .. కిరణ్ రెడ్డి నిర్మాతలుగా త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com