త్రిష ఇందులో ట్రైన్‌ అవుతోందట

  Written by : Suryaa Desk Updated: Thu, Aug 10, 2017, 05:13 PM
 

హీరో ప్రభాస్‌ తో హిట్‌ పెయిర్‌ గా నిలిచి బిగ్‌ స్టార్‌ ఎదిగిన త్రిష ప్రస్తుతం తెలుగులో కనపడకుండా పోయింది... టాలీవుడ్‌ లో  అవకాశాలు లేకపోవడంతో పూర్తిగా కోలీవుడ్‌ పనే దౄఎష్టి పెట్టిన సంగతి తెలిసిందే. తన ద్రుష్టి వ్యర్థం కాలేదు ప్రెసెంట్‌ ఈమె  చేతిలో ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది చిత్రాలుండటం విశేషం. కాస్త ఎక్కువగా చెప్పాలంటే  తమిళంలో నెంబర్‌వన్‌ స్థానం నయన్‌ తీసుకుంటే రెండవ స్థానం లో త్రిష ఉందంటున్నారు అక్కడి ఫిలిం వర్గాలు.    హీరోలకు జోడీగా నటిస్తూనే, మరోవైపు హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలకు సైన్‌ చేసి కష్టపడుతోంది.  తాజాగా త్రిష బాక్సింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది. ఓ తమిళ సినిమాలో తన పాత్ర, కథ డిమాండ్‌ మేరకే ఆమె బాక్సర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. సహజత్వానికి దగ్గర పాత్రలో కనిపించాలన్న ఉద్దేశ్యంతో ఆమె నిరంతర సాధన చేస్తోందట. ఇందుకోసం ట్రైనర్‌ సారధ్యంలో తగిన మెలకువలు తెలుసుకుంటూ బాక్సింగ్‌ పాత్ర ద్వారా మరింత గుర్తింపు పొందాలన్నదే ఆమె లక్ష్యమట. ఈమె లక్ష్యం నెరవేరాలని ఆశిద్దాం....
Recent Post