మరోసారి 2 మిలియన్ ఫీట్ చేస్తాడో లేదో చూడాలి

  Written by : Suryaa Desk Updated: Fri, Aug 11, 2017, 03:19 PM
 

చాలా రోజుల తర్వాత టాలీవుడ్ సినిమా పండగ వాతావరణం నెలకొంది. ఒకే సారి మూడు యువ హీరోల సినిమాలు రిలీజ్ అవుతుండడంతో  థియేటర్స్ దగ్గర అభిమానుల కోలాహలం బాగానే ఉండేటట్లు కనిపిస్తోంది. ఇక ఓవర్సీస్ లో కూడా ఈ మూడు సినిమాలు మధ్య పోటీ బాగానే జరగనుందట. రానా  మరియు నితిన్ మరో సక్సెస్ కోసం ఎదురు చూస్తుండగా బెల్లంకొండ శ్రీనివాస్ ఓ విజయాన్ని అందుకొని కెరీర్ ను గాడిలో పెట్టాలనుకుంటున్నాడు. 


అయితే ప్రస్తుతం అందరిలో మెడుతుతున్న ఒకే ఒక్క ప్రశ్న ఈ ముగ్గురిలో ఎవరు యూఎస్ లో అత్యధిక డాలర్లని కొల్లగొడతారు. ఓ సారి యుఎస్ మార్కెట్ రేంజ్ ని గమనిస్తే నితిన్ "అఆ" సినిమా మంచి వసూళ్ళను రాబట్టింది. త్రివిక్రమ్ సినిమాలకి మంచి మార్కెట్ ఉండడంతో ఏకంగా 2.49 మిలియన్ డాలర్లను సాధించి అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగవ చిత్రంగా రికార్డు సృష్టించింది. మొదటి స్థానంలో బాహుబలి మొదటి భాగం -రెండవ భాగం ఉండగా..మూడవ స్థానంలో మహేష్ శ్రీమంతుడు చిత్రం ఉంది. అయితే ఇప్పుడు విడుదలకాబోయే "లై" సినిమాను కూడా అమెరికాలో భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. దీంతో ఈ సినిమాతో నితిన్ మరో భారీ హిట్ అందుకుంటాడో లేదో అనేది కాస్త సందేహంగానే ఉంది. ఇప్పటివరకు చిత్రం ట్రైలర్ బావుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దాని కారణంగా క్రేజ్ కూడా విపరీతంగా పెరిగింది. మరి మరోసారి 2 మిలియన్ ఫీట్ చేస్తాడో లేదో చూడాలి. 


 


ఇక ఇవాళే "నేనే రాజు నేనే మంత్రి" మరియు బెల్లంకొండ శ్రీనివాస్ "జయ జానకి నాయక" రిలీజ్ అవ్వనున్న విషయం తెలిసిందే. ఇక ఈ రెండు సినిమాలను దాటి నితిన్ ఏ స్థాయి వరకు డాలర్లను రాబట్టగలుగుతాడో చూడాలి. ప్రీమియర్లు అయితే బాగానే వర్కవుటయ్యాయ్ అనే టాక్ వస్తోంది. అది సంగతి. 
Recent Post