స్పైడర్ ని టార్గెట్ చేసిన సోదరి

  Written by : Suryaa Desk Updated: Fri, Aug 11, 2017, 04:31 PM
 

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి రోజులు గడుస్తున్నా ఇంకా కొందరు హీరోలు సక్సెస్ ట్రాక్ ను కొనసాగించడానికి చాలా కష్టపడుతుంటారు. ఒక్క హిట్ దక్కిన సంతోషం ఎన్నో రోజులు ఉండదని తెలిసిన విషయమే. తీసిన ప్రతి సినిమాపై నమ్మకం పెట్టుకోవడం కానీ అనుకోకుండా నిరాశ పరచడం. ఇప్పుడు ఇదే పరిస్థితుల్లో ఉన్నాడు నేటి తరం యువ హీరో సందీప్ కిషన్. కాకపోతే సూపర్ స్టార్ మహేష్ అక్కయ్యతో కలసి కొత్త ప్రయత్నం చేస్తున్నాడు.


లవ్ స్టోరీస్ తో వచ్చి పర్వాలేదు అనిపించాడు. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లాంటి కామెడీ ఫిల్మ్ తో వచ్చి గాడిలో పడ్డాడు అనుకున్నారు.  కానీ ఈ హీరో ఊహించని విధంగా ఎలాంటి సినిమాలు తీస్తున్నా సక్సెస్ అనుదుకోవడం లేదు. రీసెంట్ గా విడుదలైన నక్షత్రం కూడా అతనికి ఏ మాత్రం హిట్ ఇవ్వలేకపోయింది.  దీంతో మనోడు కాస్త రూటు మార్చాడు. తమిళ్ లో కాస్త మార్కెట్ తో పర్వలేదనిపిస్తున్నాడు. ప్రస్తుతం కొన్ని మంచి సినిమాలనే లైన్ లో పెట్టాడు ఈ కుర్ర హీరో.


ఇప్పుడు తెలుగులో ఓ కొత్త తరహా లవ్ స్టోరితో రాబోతున్నాడు సందీప్. అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి మొట్ట మొదటిసారి దర్శకత్వం వహించబోతున్న ఒక లవ్ స్టోరీలో సందీప్ నటించబోతున్నాడు. అతనికి జోడిగా అమైరా దస్తూర్- త్రిధా చౌదరి నటించబోతున్నారు. ఇక ఈ సినిమా ఒక క్యూట్ లవ్ స్టోరీ అని తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని తెలిపాడు సందీప్. ప్రస్తుత షూటింగ్ లో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ త్వరలో థియేట్రికల్ ట్రైలర్ ను మహేష్ బాబు "స్పైడర్" రిలీజ్ కాబోతున్న సెప్టెంబర్ 27 వ తేదీ నాడే రిలీజ్ చేయనున్నారట దర్శకురాలు మంజుల.
Recent Post