ఇద్దరి కుటుంబాలకూ బాగా నచ్చాం

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 12, 2017, 11:59 AM
 

సాధారణంగా సినిమా స్టార్స్ మధ్య ప్రేమలు చిగురించడం కామన్ ఆలా ప్రేమలో కొన్ని రోజులు మునిగి తేలిన తర్వాత పెళ్లి చేసుకోబోతున్నామని చెబుతారు. కానీ ఏం జరుగుతుందో ఏమో గాని మధ్యలోనే వారి ప్రేమ ఆగిపోతుంది. బ్రేకప్ చెప్పేసానని చెప్పి ఒక్కసారిగా వార్తల్లో నిలుస్తారు. కానీ కొంతమంది స్టార్స్ అలా కాదు ప్రేమలో ఉన్నామని చెప్పి వెంటనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు నిర్మొహమాటంగా చెప్పేసి.. వీలైనంత  త్వరగా పెళ్లి చేసుకుంటారు.  ప్రస్తుతం టాలీవుడ్ లో అలాంటి అందమైన జంటలు చాలానే ఉన్నాయని చెప్పాలి.


ఇప్పుడే అదే తరహాలో ఓ టాలీవుడ్  జంట ఒక్కటవ్వబోతోంది. "ఏ మాయ చేసావే" జంట నాగ చతన్య - సమంత. గత కొన్నేళ్ళుగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ యువ జంట ఎట్టకేలకు పెళ్ళికి రేడి అయ్యారు. అక్కినేని కుటుంబం ఇప్పటికే పెళ్లి పత్రికలను కూడా ముద్రించింది. అయితే రీసెంట్ గా తమన్న ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి తరవాత ఎలా ఉండబోతున్నారనే విషయాల మీద కొంత క్లారీటి ఇచ్చింది.


పెళ్లి తర్వాత తాను ఏమి మారబోనని సొంత నిర్ణయాలే తీసుకుంటానని చెప్పింది. అంతే కాకుండా తాను ఓ మంచి కుటుంబంలోకి కోడలిగా వెళుతున్నందుకు చాలా ఆనందంగా ఉన్నట్లు చెబుతూ.. వారు నన్ను అర్ధం చేసుకొనగలరని చెప్పింది. ఇక నాగ చైతన్య తో ప్రేమ "ఏ మాయ చేసావే" షూటింగ్స్ లో ఉన్నపుడే కలిగిందని వివరించింది సమంత. ఇక తనకు కాబోయే భర్త గురించి చెబుతూ.. చైతు నన్ను చాలా బాగా అర్ధం చేసుకోగలడు. ఇరువురి కుటుంబాలకి మా జంట చాలా బాగా నచ్చింది అందుకే ఏ ఇబ్బంది లేకుండా త్వరలోనే ఒకటి కాబోతున్నామని సంతోషంగా చెప్పింది సమంత.  అక్టోబర్ 6న గోవాలో వీరి పెళ్ళి జరగబోతోంది. 
Recent Post