సెన్సర్ బోర్డుకు కొత్త అధిపతి

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 12, 2017, 12:01 PM
 

చాలాకాలంగా సెన్సర్ బోర్డు వాళ్ల పై  మన దేశ ఫిల్మ్ మేకర్లు అందరూ తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. మనం డైరెక్టర్లు ఇప్పుడు ఉన్న సమాజం తగ్గట్లు  కథలు రాస్తూంటే సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ వాళ్ళు పాతకాలపు పద్దతులతో వాటిపై ఆంక్షలు పెడుతూ సినిమా నిర్మించేవారికి తీవ్ర ఇబ్బందులుకు గురి చేస్తున్నారు. అయితే దేశం మొత్తం CBFC వాళ్ళ వైకరి పై ఉన్న అసహనం ఎంతో తెలుసుకొని ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్ట్రీ వాళ్ళు ఇప్పుడు ఉన్న  చీఫ్ ఫలాజ్ నీలాని తొలిగించి భావకవి గేయ రచయత అయిన ప్రసూన్ జోషిని నియమించింది.


సినిమాటోగ్రాఫ్ యాక్ట్ 1952 సెక్షన్ 3 ప్రకారం ప్రసూన్ జోషిని సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చీఫ్ గా ఎన్నుకున్నారు. ఆగష్టు 11 2017 నుండి ప్రసూన్ జోషి తన భాధ్యతలు స్వీకరించబోతునట్లు తెలుస్తుంది. ప్రసూన్ జోషి తన కెరియర్ ను అడ్వర్టయిజింగ్ రంగంతో మొదలిపెట్టి కొన్ని పేరున్న యాడ్ కంపెనీలలో క్రియేటివ్ డైరెక్టర్ గా కూడా పని చేశారు. ఆ తరువాత సినిమా గేయ రచయతగా మారి బ్లాక్ - తారే జమీన్ పర్ - డిల్లీ6 - రంగ్ దే బసంతి - నీర్జా - భాగ్ మిల్ఖా భాగ్ సినిమాలకు పాటలు కూడా రాశాడు. తన చేసిన పనికి గుర్తింపుగాను కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ మరియు జాతీయ అవార్డులు తో గౌరవించింది. ప్రధాన మంత్రి స్వఛ్ భారత్ అభియాన్ క్యాంపెయిన్ కూడా ప్రసూన్ జోషినే చేయడం జరిగింది.


ఇప్పటి తరాన్ని అర్ధం చేసుకొని కొత్తగా ఆలోచించే ప్రసూన్ జోషి CBFC చీఫ్ గా ఉండటం ఇప్పుడు అంతా ఊపిరి తీసుకున్నారు. సినిమా అంటే ఏంటో బాగా తెలిసిన మనిషిగా మన దేశ సినిమారంగ పరిస్థితులను అంచనా వేసే మనిషిగా జోషి తన బాధ్యతలును చక్కగా నిర్వహించగలడు అని అందరూ ఈ నిర్ణయానికి హర్షం వ్యక్తపరుస్తున్నారు. కళలో ఉండే వైవిద్యం మన సంస్కృతి నాగరకత తెలిసిన ఇటువంటి వారు ఉండడం ఇప్పటి సెన్సర్ బోర్డు కి ఎంతైనా అవసరం అని చెబుతున్నారు సినీ పరిశ్రమకు చెందినవాళ్లు. 
Recent Post