జయ జానకి నాయక యూనిట్ సెలబ్రేషన్

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 12, 2017, 07:02 PM
 

 బోయపాటి శీను, బెల్లం కొండ శ్రీనివాస్ ల క్రిటికల్ కాంబినేషన్ లో క్లాసిక్ టచ్ ఉన్న టైటిల్ తో  వచ్చిన జయ జానకి నాయక చిత్రం ఈ శుక్రవారం విడుదలై అన్నీ సెంటర్స్ లో సక్సెస్ టాక్ ను అందుకుంటున్న సందర్బంగా ఈ చిత్ర లో నటించిన హీరోయిన్  రకుల్ ప్రీత్ క్రొవొత్తి  తో  పటాకులు పేల్చగా,  హీరో బెల్లం కొండా సాయి శ్రీనివాస్, మరో హీరోయిన్ ప్రజ్ఞా జైశ్వాల్, నటుడు నందు, దర్శకుడు బోయపాటి శీను, నిర్మాత మిరియాల రవీందర్ లు  సెలెబ్రేట్ చేసుకున్నారు.

 అనంతరం రకుల్  మీడియా తో మాట్లాడుతూ మొదటిసారి నా మూవీ నేనే చూసి ఎక్సయిట్ అయ్యాను,  థియేటర్లు లలో వస్తున్న హ్యూజ్ రెస్పాన్స్ కు ఆనందిస్తున్నా,  తెలుగు ఫీల్డ్ లో పనిచేస్తున్నందుకు గర్వాంగా ఫీల్ అవుతున్నా అన్నారు. మా సినిమాను ఆదరిస్తున్న ప్రతి  ప్రేక్షకుడికి, దర్శక నిర్మాతలకు  నా కృతజ్ఞతలు అని తెలిపారు బెల్లం కొండా సాయి శ్రీనివాస్.  సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే థియేటర్లు పెరగడం అన్నది చాలా అరుదు అది ఈ చిత్రానికే జరగడం  చాలా  ఆనందంగా  ఉంది, విడుదలయిన  అన్నీ చోట్లా మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఓవర్ సీస్ లో, ఒక సినిమా ను నమ్మితే పహ్లయితం ఎలా ఉంటుందో తెలిపారు, ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలను తెలియచేశాయా అన్నారు నిర్మాత రవీందర్. తరువాత బోయపాటి శీను మాట్లాడుతూ ఇనామాస్ హిట్ సాధించిన చిత్రం గా భావిస్తున్నారు, ఎ, బి, సి అందరూ కలసి ఒకే వరుసలో కూర్చొని సినిమాను      


 చూసి అభినందిస్తున్నారు, చిరంజీవి గారు సినిమా టాక్ ను విని మానవ సంభంధాల విలువలు  తెలిపే  సినిమాలు  రావాలని, తప్పకుండా రెండు రోజుల్లో ఈ సినిమా ను చూస్తానని తెలిపి అభినందించారు అంటూ తెలిపారు శీను. నా సినిమా ను నేను బ్లాక్ లో టికెట్స్ కొని మరీ  చూసిన మొదటి సినిమా ఇది   చాలా ఆనందంగా ఉందని తెలిపారు నటుడు నందు. 
Recent Post