యంగ్ టైగర్ ఎన్టీయార్ ఇటీవల రెండోసారి తండ్రి అయిన సంగతి తెలిసిందే. ఎన్టీయార్ భార్య ప్రణతి ఇటీవలె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇటీవలె ఎన్టీయార్ ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరిచాడు. అందులో తొలి పోస్ట్‌గా తన సినిమా `అరవింద సమేత` ఫస్ట్‌లుక్‌ను షేర్ చేసిన ఎన్టీయార్.. తాజాగా తన ఇద్దరు కుమారుల ఫోటోను షేర్ చేశాడు.ఎన్టీయార్ పెద్ద కొడుకు అభయ్‌రామ్.. తన తమ్ముడిని ఒడిలో పెట్టుకుని ఆడిస్తున్నప్పుడు ఎన్టీయార్ ఆ దృశ్యాన్ని తన ఫోన్లో బంధిస్తున్నాడు. ఆ ఫోటోను ఎన్టీయార్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.