ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూనియర్ పవర్ స్టార్ అనొద్దు

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 19, 2018, 04:08 PM



తన కొడుకు అకీరా నందన్ విషయంలో చాలా ఎమోషనల్ గా కనిపిస్తూ ఉంటుంది రేణు దేశాయ్. ఎప్పటికప్పుడు అతడి ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అతడి గురించి ఉద్వేగంగా స్పందిస్తుంటుంది. అకీరా యుక్త వయసుకు వచ్చిన నేపథ్యంలో ఈ మధ్య రేణు మరింత ఉద్వేగంగా కనిపిస్తోంది. తాజాగా తన కొడుకుకు సంబంధించిన ఓ స్పెషల్ ఫొటో ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది రేణు. అదొక ఇంటెన్స్ బ్లాక్ అండ్ వైట్ ఫొటో. అకీరా తన ల్యాప్ టాప్ లోని ఒక గేమ్ యాప్ కోసం వెతుకుతున్నపుడు తీసిన ఫొటో ఇదట. ఇందులో ఒక ఇంటెన్సిటీ కనిపిస్తోంది. ఈ ఫొటోను షేర్ చేస్తూ.. దానికి ఒక షరతు పెట్టింది రేణు. పవన్ కళ్యాణ్ అభిమానులెవరూ అకీరాను ‘జూనియర్ పవర్ స్టార్’ అని సంబోధించవద్దని ఆమె ఆదేశించింది. 


అలా ఎవరైనా చేస్తే వెంటనే బ్లాక్ చేసేస్తానని కూడా రేణు అంది. ఐతే ఆ వాక్యం పక్కనే స్మైలీ ఇమోజీ పెట్టడం ద్వారా ఈ విషయంలో తాను మరీ అంత సీరియస్ ఏమీ కాదని చెప్పకనే చెప్పింది రేణు. తన కొడుకు పవన్ కొడుగ్గా కంటే సొంతంగా గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాడని ఆమె చెప్పింది. ఐతే తండ్రి బాటలో అకీరా సినిమాల్లోకి రాబోతుండటం మాత్రం పక్కా అని తెలుస్తోంది. రేణు ఏం చెప్పినప్పటికీ అకీరాను పవన్ కొడుగ్గానే చూస్తారు అభిమానులు. భవిష్యత్తులో అతడికి ‘జూనియర్ పవర్ స్టార్’ అనే బిరుదు రాకుండా పోదు. మెగా ఫ్యామిలీ అతడికి బ్యాకప్ ఇవ్వకుండానూ మానదు. మరి అకీరా తెరంగేట్రం ఎలా జరుగుతుంది.. ఇందులో పవన్ పాత్ర ఏమేరకు ఉంటుంది అన్నది ఆసక్తికరం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com