బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్ గ్లోబల్ స్టార్ ప్రియాంకచోప్రాతో కలిసి పనిచేయాలని ఆశపడుతున్నాడట. ‘కమీనే’, ‘7 ఖూన్ మాఫ్’ చిత్రాల్లో భరద్వాజ్ దర్శకత్వంలో ప్రియాంక నటించింది షేక్ స్పియర్ నాటకం ట్వెల్త్ నైట్ ఆధారంగా రూపొందే చిత్రంలో ప్రియాంక అవకాశం ఇవ్వనున్నాడు.. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ,అంతర్జాతీయంగా పేరు ఉన్న నటి ప్రియాంక. ఇప్పటికే న్యూయార్క్లో ఆమెను రెండు మూడుసార్లు కలిశాను. త్వరలోనే మేమిద్దం కలిసి పనిచేస్తాం. బహుశా షేక్స్పియర్ నాటకం ‘ట్వెల్త్ నైట్’ ఆధారంగా ఈ చిత్రం ఉంటుంది అని పేర్కొన్నాడు.. ఆయన గతంలోనూ షేక్స్పియర్ నాటకాల ఆధారంగా ‘మక్బూల్’, ‘ఓంకార’, ‘హైదర్’ చిత్రాలను తెరకెక్కించాడు.