ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స‌మ‌యాన్ని మ‌ర్చిపోవాలి

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 21, 2018, 12:09 PM



అబ్బురపరిచే పాత్రలు వస్తే తరుచుగా సినిమాలు చేస్తానంటోంది బాలీవుడ్‌ నటి కాజోల్‌. అజయ్‌ దేవగణ్‌తో వైవాహిక జీవితంలో అడుగుపెట్టాక సినిమాలు తగ్గించేసింది కాజోల్‌. ప్రస్తుతం ఇళ్లు పిల్లలను చూసుకునేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తోంది. ధనుష్‌ హీరోగా వచ్చిన వీఐపీ 2 చిత్రంలో కీలక పాత్ర పోషించిన కాజోల్‌..అలాంటి ఆసక్తికరమైన అవకాశాల కోసం వేచి చూస్తున్నానని చెప్పింది. పాత్ర నిడివి తనకు ముఖ్యం కాదంది. ఒకటీ రెండు సన్నివేశాల పాత్రైనా…అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. ఇటీవల కాజోల్‌ మాట్లాడుతూ…..సినిమాలో నేను ప్రధాన పాత్ర కాకపోయినా ఫర్వాలేదు. నేను వేసే వేషం ఆకట్టుకునేలా ఉండాలి. నిడివి గురించి పట్టించుకోను. నేనే సినిమా అంతా ఉండాలనుకోవడం లేదు. ఒకటీ రెండు సన్నివేశాలు ఉన్నా అద్భుతంగా ఉండాలి. అలాంటి పాత్ర కోసం వేచి చూస్తున్నా. ఓ మంచి వేషంలో నటిస్తే గొప్ప పుస్తకం చదివిన అనుభూతి కలుగుతుంది. నాకు పుస్తకాలు చదవడం అలవాటు. వాటి వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంటుంది. ఒక్కో గొప్ప పుస్తకాన్ని సమయం మర్చిపోయి ఉదయం 4 గంటల దాకా చదువుతాం. ఏడింటికి షూటింగ్‌ వెళ్లాల్సి ఉన్నా ఆ పుస్తకాన్ని కిందపెట్టేయం. అలాంటి ఆసక్తి కలిగించే వేషాలు కోరుకుంటున్నా.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com