ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్‌ దేవరకొండ ‘గీతా గోవిందం’…

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 21, 2018, 12:19 PM



అర్జున్‌ రెడ్డి సూపర్‌హిట్‌ తర్వాత విజయ్‌ దేవరకొండ మంచి ఫామ్‌లోకి వచ్చాడు. దాదాపు ప్రతి నిర్మాత ఆయన డేట్స్‌ కోసం ప్రయత్నించినవారే. వైవిథ్యమైన కథా చిత్రాలను తీయాలని భావించిన దర్శకులు విజయ్‌ను సంప్రదించారు. ఇలా ఊపిరిసలపనంత బిజీ అయ్యాడు. కానీ కమిటైన చిత్రాలతో పోలిస్తే వాటి రిలీజ్‌ మాత్రం వేగంగా ఉండటం లేదు.  ఈ మూవీ ఫస్ట్ లుక్ ని  ఈ నెల 23వ తేదిన విడుదల చేయనున్నారు.


తాజాగా విజయ్‌ దేవరకొండ గీతా ఆర్ట్స్‌ సంస్థలో నటించేందుకు అంగీకరించాడు. బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అల్లు అరవింద్‌ సమర్పకులు. గీతా సంస్థలో విజయ్‌ అడుగిడడం ఆసక్తికలిగించే పరిణామం. ఇకపోతే ఈ చిత్రానికి గీత గోవిందం అనే టైటిల్‌ ఖరారు చేశారు. టైటిల్‌ చూడగానే విజయ్‌ తరహా చిత్రమని స్పష్టమవుతోంది. ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహిస్తారు. ఆయన ఇదే కంపౌండ్‌లో శ్రీరస్తు శుభమస్తు చిత్రానికి దర్శకత్వం వహించారు. రష్మిక నాయికగా నటించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com