ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిల్ల‌లంత సులువు కాదేమో

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 21, 2018, 03:30 PM



చిత్ర రంగంలో తనకు చాలా పేరొచ్చిందని, అలాంటి కీర్తి తన పిల్లలకు వస్తుందనే నమ్మకం లేదంటోంది హాలీవుడ్‌ తార క్యాథరీన్‌ జీటా జోన్స్‌. ద టెర్మినల్‌, మాస్క్‌ ఆఫ్‌ జోరో చిత్రాలతో ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను అలరించిన క్యాథరీన్‌….తనకంటే ఇరవై ఏళ్లు పెద్ద వాడైన నటుడు మైఖేల్‌ డగ్లస్‌ను పెళ్లి చేసుకుంది. డైలన్‌, క్యారీస్‌ అని వాళ్లకు ఇద్దరు పిల్లలున్నారు. వీళ్లిప్పటి యుక్త వయసుకు చేరుకున్నారు. ఇద్దరూ చిత్ర రంగంలోకి అడుగుపెట్టాలని ఊవిళ్లూరుతున్నారు. వాళ్ల ఆసక్తిని గమనించిన క్యాథరీన్‌…తన వంతు ప్రోత్సాహాన్ని అందిస్తానని చెప్పింది. అయితే నటులుగా పేరు తెచ్చుకోవడం, విజయాలు సాధించడం అంత సులువని భావించడం లేదని తెలిపింది. అదే సమయంలో తన పిల్లలకు మంచి ప్రతిభ ఉందని…వాళ్లపై తమకు నమ్మకముందని చెప్పింది. క్యాథరీన్‌ మాట్లాడుతూ…సినిమా రంగంలో అద్భుతమైన జీవితాన్ని చూశాను. నేనూ నా భర్త మైఖేల్‌ డగ్లస్‌ నటీనటులుగా ఎంతో పేరు తెచ్చుకున్నాం. ఇప్పుడు మా పిల్లలు తెరంగేట్రం చేస్తామంటే వాళ్లపై చాలా అంచనాలే ఉంటాయి. మాలా వాళ్లు స్టార్స్‌ అవడం తేలిక కాదు. కష్టపడాలి. వాటిని అధిగమించి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. వాళ్లకున్న ప్రతిభతో అనుకున్నది సాధిస్తారని ఆశిస్తున్నా. అంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com