ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజ‌య్ కొత్త మూవీ స‌ర్కార్ పోస్ట‌ర్ పై ఎంపి ఫైర్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 22, 2018, 04:40 PM



తమిళ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తున్న స‌ర్కార్ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది..మురుగదాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా పోస్టర్ లో విజయ్ సిగరెట్ తాగుతూ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ స్టిల్ పై తమిళనాడు ఎంపీ , మాజీ ఆరోగ్యశాఖ మంత్రి అన్బుమని రామదా స్ ఫైర్ అయ్యారు.. “ఈ పోస్టర్ ద్వారా సిగరెట్ ను ప్రమోట్ చేస్తున్నావా? ఇలా చేయడం నిజంగా సిగ్గుచేటు. ఒక నటుడిగా స్మోకింగ్ ను ప్రమోట్ చేయకపోవడం నీ బాధ్యత” అంటూ కామెంట్ చేశారు. ‘సినిమాల్లో సిగరెట్ తాగనని గతంలో అన్నావు .. ఇప్పుడు చేసిందేవిటి’ అంటూ ప్రశ్నించారు. అంతేకాదు .. గతంలో ‘ఇకపై సినిమాల్లో సిగరెట్ తాగాను’ అంటూ విజయ్ ఇచ్చిన స్టేట్మెంట్ కి సంబంధించిన పేపర్ కటింగ్ ను కూడా ఆయన ఈ ట్వీట్ కి జత చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com