అక్కినేని హీరో అఖిల్ తన మూడో మూవీని ప్రారంభించాడు.. ఈ మూవీకి వెంకీ అట్లూరి దర్శకుడు.. నిధి అగర్వాల్ హీరోయిన్. ఈ మూవీ షూటింగ్ లండన్ లో ప్రారంభమైంది… రెండు నెలల పాటు లండన్ లోనే షూటింగ్ జరుపుకోనుంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు.ఈ సినిమాకి సంబంధించిన 50 శాతానికి పైగా షూటింగ్ ఈ రెండు నెలలలో పూర్తి చేస్తారు. ఈ సినిమాలో అఖిల్ ప్లే బాయ్ గా కనిపించనున్నాడు.. ఈ షూటింగ్ స్పాట్ ఫోటోను చిత్ర యూనిట్ షేర్ చేసింది.. ఈ ఫోటోలో అఖిల్, హీరోయిన్ నిధి అగర్వాల్, దర్శకుడు వెంకీ అట్లూరి ఉన్నారు