మెగా బ్రదర్ నాగబాబు గారాల పట్టి నిహారిక ఒక మనసు తర్వాత తెలుగులో నటించిన చిత్రం హ్యాపీ వెడ్డింగ్. లక్ష్మణ్ కర్య ఈ సినిమాతో డైరెక్టర్ గా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. సుమంత్ అశ్విన్, నిహారిక హీరో హీరోయిన్స్‌గా తెరకెక్కిన ఈ చిత్రం రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందినట్టు తెలుస్తుంది. పల్లెటూరు... ప్రేమ.. పెళ్లి హడావుడి కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు . థమన్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఇస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ మరియు పాకెట్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఇటీవల హ్యాపీ వెడ్డింగ్ ఫస్ట్ ఇన్విటేషన్ అంటూ వీడియో విడుదల చేసిన టీం తాజాగా సినిమా నుండి తొలి పాట విడుదల చేసింది. ధనుంజయ్ పాడిన ఈ పాట సంగీత ప్రేక్షకులని అలరిస్తుంది. చిత్ర ట్రైలర్ జూన్ 30 ఉదయం 10.36ని.లకి విడుదల కానుంది. మూవీని జూలై నెలఖారున విడుదల చేయనున్నట్టు సమాచారం. నిహారిక.. నూతన దర్శకురాలు సుజనా తెరకెక్కించనున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రంలోను నటిస్తుంది. ఇందులో శ్రియాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఇక నిహారిక మరో చిత్రం కొద్ది సేపటిక్రితం లాంచ్ అయింది. ప్రణీత్ బ్రహ్మండపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రాహుల్ విజయ్ కథానాయకుడిగా కనిపించనున్నాడు.