ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియుడి పాత ఫొటో చూసి షాక్ తిన్న బాలీవుడ్ బ్యూటీ

cinema |  Suryaa Desk  | Published : Sun, Jun 24, 2018, 04:22 PM



రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోన్ పెళ్లికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే కదా. ఇప్పటికే నవంబర్ 10న వీళ్ల పెళ్లి జరగనున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఈ సమయంలో రణ్‌వీర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటో చూసి దీపికా షాక్‌కు గురైంది. ఒక్కసారిగా నో అంటూ కామెంట్ చేసింది. రణ్‌వీర్ తాను ఎప్పుడో 1985లో దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అవంత్ గర్డె సిన్స్ 1985 అంటూ దానికి క్యాప్షన్ పెట్టాడు. నిజానికి ఈ ఫొటో చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు ఈ ఫొటోలో ఉన్నది రణ్‌వీరేనా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీపికాతోపాటు మరికొందరు బాలీవుడ్ స్టార్లు ఆయుష్మాన్ ఖురానా, గుల్షన్ గ్రోవర్, అర్జున్ కపూర్ కూడా ఈ ఫొటోపై కామెంట్ చేశారు. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ఓ ఎమోజీతో స్పందించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com