ఈ అందాల భామకు పెళ్లి కుదిరింది

  Written by : Suryaa Desk Updated: Wed, Aug 16, 2017, 03:59 PM
 

మంచు మనోజ్‌ హీరోగా చేసిన నేను మీకు తెలుసా సినిమాలో హీరోయిన్‌ గా నటించింది రియా సేన్‌.   ఆ సినిమా లో  ఈమె అందానికి మంచి స్పందనే వచ్చినా  ఆ తరువాత పెద్దగా ఆఫర్లు రాలేదు. దానితో హిందీలో కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. ఇప్పుడైతే ఏక్తా కపూర్‌ ప్రొడ్యూస్‌ చేస్తున్న ఒక టివి సీరియల్లో నటిస్తుంది. ఈ టివి సీరియల్‌ రాగిణి ఎంఎంఎస్‌ సినిమా ఆదారంగా తీస్తునట్లు చెబుతున్నారు. అయితే ఈ36 ఏళ్ల హింది నటి తన బోయ్‌ ఫ్రెండ్‌ మరియు ఫొటోగ్రాఫర్‌ శివం తో ఎప్పటి నుండో ప్రేమలో ఉంది. ఇప్పటికీ వీళ్ళు పెళ్లి చేసుకొని ఒకటికావలనే నిర్ణయం తీసుకున్నారు. రియా సేన్‌ తన సినిమాలు కన్నా ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. హాట్‌ ఫోటోలు పెడుతూ తన ప్రియుడుతో సరదా గడిపిన విశేషాలు  చెబుతూ హడావిడి చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం రియా  తన ఫొటోగ్రాఫర్‌ ప్రియుడు  శివం తో పెళ్ళికి సిద్దమైంది. ఈ నెల తరువాత ఒక డేట్‌ ని ఖరారు చేసుకుంటాం అని కూడా చెబుతుంది.   ఈమెకు ఒక అక్క కూడా ఉంది. రైమా సేన్‌ అనే నటి కూడా రియా సేన్‌ లానే అంతగా ఫేమస్‌ కాలేకపోయింది. కొన్ని మంచి ప్రాంతీయ చిత్రాలలో నటించినా  ఎందుకో ఈ అక్కచెల్లలుకు అంతగా గుర్తింపు రాలేదు. కొంతమంది హీరోయిన్లు వస్తారు చాలా కాలం ఉంటారు. కానీ పెద్దగా స్టార్‌ హీరోయిన్‌ కాకుండగానే సినిమాను వదిలి వెళ్లిపోతారు. సినిమా హీరోయిన్లు అయితే చిన్న వయసులోనే వస్తారు. కొంచం మంచి హిట్లు వస్తే ఎక్కువ కాలం ఉండటానికి ప్రయత్నం చేస్తారు లేకపోతే పెళ్లి కుదిరేవరకు ఏదో వచ్చిన సినిమాలు చేస్తూ ఉంటారు.  ఇలానే వచ్చింది మన ముంబాయి అమ్మాయి రియా సేన్‌ కూడా. అయితే  చిన్న వయసులోనే వచ్చినా   అనుకున్నంత స్థాయిలో పేరు సంపాదించలేక పోయి పెళ్ళికి సిద్దపడింది అంటున్నారు అక్కడి ఫిల్మ్‌ వర్గాలు.  ఏది ఎమైనా పెళ్లి తో ఒక్కటవుతున్న ఈ జంటను ఆశీర్వదిద్దాం..
Recent Post