నెపోలియన్‌ ట్రైలర్‌ను లాంచ్‌ చేసిన సందీప్‌ కిషన్‌

  Written by : Suryaa Desk Updated: Wed, Aug 16, 2017, 04:03 PM
 

ఆచార్య క్రియేషన్స్‌, ఆనంద్‌ రవి కాన్సెప్‌‌ట బ్యానర్స్‌పై రూపొందుతున్న చిత్రం ’నెపోలియన్‌’. ఆనంద్‌ రవి దర్శకుడు. భోగేంద్ర గుప్త మడుపల్లి నిర్మాత. ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో జరిగింది. కె.ఎల్‌.దామోదర్‌ ప్రసాద్‌, హీరో సందీప్‌కిషన్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకుడు   ఆనంద్‌ రవి ఈ చిత్ర విషయాలను తెలుపుతూ నేను ఈ కథతో చాలా మందిని కలిశాను. ’నీడపోయింది’ అనే పాయింట్‌ చెప్పగానే ఇది షార్‌‌ట ఫిలిమా అని అడిగారు. తర్వాత నేనే హీరో అనగానే నువ్వే హీరోనా అని చాలా మంది అన్నారు. ప్రొడ్యూసర్‌ ఎవరని చాలా మంది అడిగారు. ఇలా అందరి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చుకుంటూ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. థ్రిల్లర్‌ జోనర్‌ మూవీయే అయినా, కొత్త కాన్సెప్‌‌టతో సాగుతుంది. ఇంత వరకు ప్రేక్షకులు నా సినిమాల నుండి ఏం కోరుకుంటున్నారనే అనుభవాన్నంతా కూడా ఈ సినిమాలో రాసుకున్నాను. అందరికీ కనె్‌‌ట అయ్యేలా  సినిమా ఉంటుందన్నారు. కె.ఎల్‌.దామోదర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ  ఆనంద్‌ రవి చేసిన పేరెంట్స్‌ మూవీ చూసిన రోజే తప్పకుండా ఇతను మంచి దర్శకుడు అవుతాడని భావించాను. ప్రతినిధి సినిమా కూడా చాలా మంచి కథతో రన్‌ అవుతుంది. తను ఈ సినిమాలో నటిస్తున్నాడని తెలియగానే తను ఎందుకు నటన పట్ల ఆసక్తి చూపుతున్నాడని అనుకున్నాను. అయితే ట్రైలర్‌, పోస్టర్స్‌ చూడగానే తనైతేనే కరె్‌‌టగా యాప్‌‌ట అవుతాడనిపించిందన్నారు.  సందీప్‌కిషన్‌ మాట్లాడుతూ ఆనంద్‌ రవి తో  12 సంవత్సరాలుగా పరిచయం ఉంది. కష్టనష్టాల్లో నాకు తోడుగా నిలిచారు. ప్రతినిధి, ఈ సినిమా కూడా నేనే చేయాల్సింది కానీ కుదరలేదు. నెక్స్‌ట్‌ మూవీ అయినా చేయాలనుకుంటున్నాను. రవన్న సినిమా కథలన్నీ బావుంటాయి. ఈ నెపోలియన్‌ సినిమా వాటన్నింటి కంటే మరో ఎత్తులో ఉంటుందని భావిస్తున్నాను అన్నారు. ఆనంద్‌ రవి, కోమలి, రవివర్మ, కేదార్‌ శంకర్‌, మధుమణి, అల్లు రమేష్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటర్‌: కార్తీక్‌ శ్రీనివాస్‌, మ్యూజిక్‌: సిద్ధార్‌‌థ సదాశివుని, సినిమాటోగ్రఫీ: మార్గల్‌ డేవిడ్‌, పాటలు: బాలాజీ, ఆర్‌‌ట: బాబ్జి, నిర్మాత: భోగేంద్ర గుప్తా మడుపల్లి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆనంద్‌ రవి.
Recent Post