ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెట్టింపు ఎనర్జీతో రవితేజ టీజర్‌

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 16, 2017, 04:11 PM



యంగ్‌  ఇంటెలిజెంట్‌   డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మాస్‌ మహరాజ్‌ హీరో గా దిల్‌ రాజు ప్రొడక్షన్‌ లో నిర్మాత  శిరీష్‌ సమర్పిస్తున్న చిత్రం ’రాజా ధి గ్రేట్‌’.  ఈ చిత్ర టీజర్‌ ను ఇటీవలే విడుదల చేసారు యూనిట్‌.  టీజర్‌ విడుదలైన ఒకే రోజు లోనే  మిలియన్స్‌ ఆఫ్‌ వ్యూస్‌ రావడం నిజంగా గ్రేట్‌ అనొచ్చు.. గ్రేట్‌ ఇమేజ్‌ తో దూసుకుపోతున్న రవితేజ కెరీర్‌  ప్రస్తుతం యావరేజ్‌ స్థాయికి చేరుకుంది. ఈ తరుణం లో రాజా ది గ్రేట్‌ అంటూ మరోసారి తన ఎనర్జీ ని రెట్టింపు చేస్తూ, ఖచ్చితంగా హిట్‌ కొట్టాలనే కసితో  ప్రేక్షకుల ముందుకు రానున్నాడని ఈ చిత్ర టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. ’ఐ యామ్‌ బ్లైండ్‌ బట్‌ ఐ యామ్‌ ట్రైన్డ్‌’ అనే పవర్‌ ఫుల్‌  డైలాగ్‌ లొనే ఈ చిత్ర కాన్సెప్ట్‌ దాగుందని తెలుస్తోంది. ఈ ఒక్క డైలాగ్‌ చాలు మాస్‌ రాజ్‌ కెరీర్‌ మళ్లీ పుంజుకుంటుందని చెప్పడానికి, ఇదిలా ఉంటే...  దర్శకుడు అనిల్‌ రావిపూడి  టాలెంట్‌   చిత్ర టీజర్‌ లోనే కనబడింది.    ఇమేజ్‌ స్థాయిలో ఉన్న హీరో ను అంధుడిగా చూపించడం ప్రేక్షకులను మెప్పించడం లాంటివి ఇతనికి కత్తిమీద సాములాంటిదే అని చెప్పొచ్చు... ప్రకాష్‌ రాజ్‌, సంపత్‌, రాధిక ఇలా మోస్ట్‌ టాలెంటెడ్‌ నటీనటులు ఈ చిత్రం లో నటిస్తున్నారంటేనే దర్శకుడి కథలో ఎంత దమ్ముందో చెప్పకనే చెప్పేయొచ్చు...   అల్రెడీ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ గా  పేరు తెచ్చుకున్న అనిల్‌ కు ఈ చిత్రం మరో ఛాలెంజింగ్‌  అవనుంది. పేరొందిన ప్రొడక్షన్‌ లో  ఇద్దరు ఎనర్జిటిక్‌ టాలెంటెడ్‌ పర్సన్స్‌ కలసి చేసిన  చిత్రం ఏ రేంజ్‌ లో ఉంటుందో నని ఇటు ప్రేక్షకులు, అటు  రవితేజ అభిమానులు ఈగర్‌ గా వెయిట్‌ చేస్తున్నారు.  బిగ్‌ కాస్ట్‌ అండ్‌ క్రూ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.





 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com