కల్యాణ్ రామ్ పుట్టిన రోజు .. ఈ రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన తాజా చిత్రానికి సంబంధించిన ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. ప్రముఖ సినిమాటోగ్రఫర్ గుహన్ .. దర్శకుడిగా ఒక థ్రిల్లర్ మూవీ చేయడానికి రంగాన్ని సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. కల్యాణ్ రామ్ 16వ మూవీగానే ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
కల్యాణ్ రామ్ ఈ పోస్టర్ లో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు .. మరింత హ్యాండ్సమ్ గా అనిపిస్తున్నాడు. ఉత్కంఠభరితమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందనుందట. అనూహ్యమైన మలుపులతో ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుందని చెబుతున్నారు. కల్యాణ్ రామ్ కెరియర్లోనే ఇది చెప్పుకోదగిన సినిమా అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం కథానాయిక కోసం అన్వేషణ కొనసాగుతోంది. మిగతా నటీనటులు .. సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.