ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రజనీ సరసన కథానాయికగా సిమ్రాన్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 05, 2018, 05:04 PM



ప్రస్తుతం రజనీకాంత్ .. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. రజనీకాంత్ ను డిఫరెంట్ లుక్ లో కార్తీక్ సుబ్బరాజు చూపించనున్నాడట. ఆయన లుక్ ఎలా వుండనుందనే ఆసక్తి అందరిలోను మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో కథానాయికగా సిమ్రాన్ ను తీసుకున్నారని తెలుస్తోంది.


తెలుగు .. తమిళ భాషల్లో ఒకప్పుడు అగ్రకథానాయికగా సిమ్రాన్ ఒక వెలుగు వెలిగింది. ఈ మధ్యనే తమిళంలో రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె, తన వయసుకి తగిన పాత్రలను చేస్తూ వస్తోంది. అలాంటి ఆమెను రజనీ సరసన కథానాయికగా సంప్రదించడం విశేషం. ఊహించని ఈ అవకాశంతో ఆమె పొంగిపోతోందని అంటున్నారు. ఏకధాటిగా ఈ సినిమా షూటింగును 40 రోజులపాటు డార్జిలింగ్ లో జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com