హైదరాబాద్ లో కొన్ని ఫ్యామిలీస్ కు సంబంధించి ఏదన్నా పెళ్ళి జరుగుతోంది అంటే మాత్రం.. ఆ హడావుడి తీరే ఒక రేంజులో ఉంటుంది. అలాంటి బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ ఒకటి ఇప్పుడు రెండు పెద్ద ఫ్యామిలీల్లో జరుగుతోంది. శ్రీయ భూపాల్, ఆనందిత్ పెళ్ళి గురించే ఇప్పుడు టాక్ అంతా..
ఆల్రెడీ శ్రీయ అండ్ ఆనందిత్ ల నిశ్చితార్ధం ఫ్రాన్స్ రాజధాని పారిస్ కు దగ్గర్లో ఉన్న పెద్ద పురాతన ప్యాలెస్ లో జరిగింది. జివికె మనవరాలు అయిన శ్రీయకు.. అపోలో గ్రూప్ కు ఒకానొక వారసుడు అయిన ఆనందిత్ కు పెళ్ళంటే..మరి గ్రాండ్ రేంజ్ ఎలా ఉంటుందో తెలిసిందే. ఈ పెళ్ళిలో ఉపాసన కు మంచి ఫ్రెండ్ అయిన నమ్రత శిరోద్కర్ తన చిన్నారి కూతురు సితారతో కలసి పాల్గొన్నారు.
అక్కడి నుంచి కొన్ని ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు నమ్రత. అవర్ వెరీ ఓన్ శ్రియ ఆండ్ ఆనందిత్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్, విషింగ్ యూ టు ఎ లైఫ్ ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఆండ్ హ్యాపినెస్ అని పోస్ట్ చేసారు ద బిగ్ ఫాట్ ఇండియన్ వెడ్డింగ్ అని టాగ్ చేసారు.ఉపాసన ఐతే సితారతో దిగిన పిక్స్ ఆండ్ వీడియోస్ కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసారు. అవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.నెటిజన్లు షేర్ల మీద షేర్లు చేసుకుంటున్నారు. సితార ఎప్పుడు ఏం చేసినా కూడా క్యూట్ గా బాగుంటుంది. గతంలో ఒక అవార్డ్స్ ఫంక్షన్ స్టేజీపై డ్యాన్సుతో అందరినీ అవాక్కయ్యేలా చేసింది.
ఆ తరువాత నమ్రత షేర్ చేసిన ఏ ఫోటో చూసినా కూడా సితార చిలిపి అల్లరి భలే గమ్మత్తుగా ఉంటుంది. ఈ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్లో సూపర్ స్టార్ మహేష్ ముద్దుల కూతురు సితారే హైలైట్ గా నిలిచింది. నమ్రత సితారలతో పాటు మహేష్ పెద్ద అక్క గల్లా జయదేవ్ భార్య అయిన పద్మ గారు కూడా ఈ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్లో పాల్గొన్నారు. ఈ ఫొటోలన్నీ కుడా ఇప్పుడు టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా గా మారిపోయాయి.
సూపర్ స్టార్ మహేష్ తనయ సితార ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సితార కు సంబంధించి సోషల్ మీడియాలో ఏ ఫొటో కనిపించినా, వీడియో కనిపించినా అవి వైరల్ అయిపోతాయి. నెటిజన్ల నుంచి కామెంట్స్, లైక్స్ వెల్లువలా వస్తాయి.
Cute little princess #Sitara #UncrownedKingSSMBBdayIn35D #35DaysToSSMBBdayCDP #SSMB25 #superstar @urstrulyMahesh pic.twitter.com/68MGYC6scj
— #UncrownedKingSSMBBdayIn35D (@urstrulyRaghu1) July 5, 2018
#Namrata and #Sitara in wedding pic.twitter.com/ZToc0tkQ7X
— Mahi Sindhu (@sindhu4mahesh) July 4, 2018