ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దారుణంగా ప్రవర్తించిన నవదీప్, దీక్ష

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 17, 2017, 11:04 AM



తెలుగు 'బిగ్ బాస్' షో రాను రాను ఆసక్తిలేకుండా సాగుతుందనే విమర్శలు రావడం, గత వారం రేటింగ్ కూడా కాస్త తగ్గడంతో షో నిర్వాహకులు రూటు మార్చారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా నవదీప్‌ను రప్పించడంతో పాటు.... లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో మసాలా పెంచారు. బిగ్ బాస్ స్టార్ హోటల్ పేరుతో ప్రస్తుతం కొత్త టాస్క్ రన్ అవుతోంది. ఇందులో నవదీప్, దీక్ష గెస్టులుగా ఉండాలని, ఇతర బిగ్ బాస్ ఇంటి సభ్యులంతా హోటల్ సిబ్బందిగా ఉండాలని బిగ్ బాస్ ఆదేశించారు. ప్రిన్స్‌ను హోటల్ మేనేజర్‌గా, కార్తీక, హరితేజలను చెఫ్‌లుగా, ముమైత్ ఖాన్‌ను పర్సనల్ అసిస్టెంటుగా, శివ బాలాజీ, ఆదర్శ్, ధనరాజ్, అర్చన వెయిటర్లుగా నియమించారు.


అయితే నవదీప్, దీక్ష పంత్‌లను ప్రత్యేకంగా పిలిచిన బిగ్ బాస్.... హోటల్ సిబ్బంది చిరాకు పడేలా, తాము ఈ పనులు చేయము అనేలా వారిని విసిగించాలంటూ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. దీంతో ఆ ఇద్దరూ రెచ్చిపోయి ప్రవర్తించారు.


హోటల్ సిబ్బందికి విసుగు తెప్పించడంలో భాగంగా నవదీప్ దారుణంగా ప్రవర్తించాడు. అర్చనను పిలిచి కాళ్లకు మసాజ్ చేయించుకున్నాడు. తాను అర్దనగ్నంగా మారుతానని, థాయ్ మసాజ్ చేయాలని డిమాండ్ చేశాడు. తన కాలి బ్రొటన వేలుపై ఉన్న వెంట్రుకలను అర్చన తన పంటితో పీకాలని ఆదేశించాడు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com