ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్కినేని హీరోకు `అన్నపూర్ణ` సపోర్ట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 06, 2018, 03:19 PM



అక్కినేని సుశాంత్ అప్ కమింగ్ మూవీ `చి ల సౌ` ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.`అందాల రాక్షసి ` ఫేమ్ రాహుల్ రవీంద్రన్ తొలిసారి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలైంది. ఆ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. సల్మాన్ ఖాన్ అమితంగా ఇష్టపడుతూ...ఆంజనేయ స్వామిని ఆరాధించే ఓ బ్యాచ్ లర్ పాత్రలో సుశాంత్ నటించాడు. ఆ ఇద్దరి లాగే పెళ్లి చేసుకోకుండా లైఫ్ లాంగ్ బ్యాచ్ లర్ గా ఉండిపోవాలని కోరుకునే సుశాంత్.......పెళ్లి చేసుకోక తప్పదని సుశాంత్ ను ఒత్తిడి చేసే తల్లిదండ్రులు - ఫ్రెండ్స్....ఇలా సాగిపోతోన్న సుశాంత్ లైఫ్ లోకి ఓ ఆమ్మాయి రాకతో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ చిత్ర టీజర్ ఆకట్టుకుంది. బ్యాచ్ లర్ పాత్రలో సుశాంత్ - అతడి ఫ్రెండ్ పాత్రలో వెన్నెల కిశోర్ ఆకట్టుకున్నారు. 


అయితే తాజాగా  ఈ చిత్రంతో  ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ చేతులు కలిపింది. సిరుని సినీ కార్పొరేషన్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధపడింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో - ప్రీ రిలీజ్ వేడుకల తేదీలను చిత్ యూనిట్ వెల్లడించనుంది. సుశాంత్ సరసన రుహానీ శర్మ నటిస్తోన్న ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహార్ సంగీతం అందిస్తున్నారు. ఎం. సుకుమార్ ..సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆటాడుకుందాం రా....చిత్రం తర్వాత దాదాపు రెండేళ్ల విరమం అనంతరం `చి ల సౌ`తో సుశాంత్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంతో మంచి హిట్ ను అందుకోవాలని చూస్తున్నాడు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్  ఈ చిత్రాన్ని విడుదల చేయనుండడంతో మూవీకి మంచి హైప్ వచ్చింది. ఇక త్వరలోనే ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com