ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెరూన్ కలర్ డ్రెస్ లో అదిరిపోయేలా శృతిహాసన్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 06, 2018, 03:23 PM



శృతిహాసన్ ఇటీవలే ఓ ఫొటో షూట్ లో పాల్గొంది. ఇండియాలో ఫేమస్  లగ్జరీ ఫ్యాషన్ వెబ్ సైట్ ‘పెరినా’ కోసం శృతి ఫొటోలకు ఫోజిచ్చింది. ఈ ఫొటోలు బయటకు రావడంతో శృతిని చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఆమె చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తోంది. పెళ్లికూతురు గెటప్ లో మెరూన్ కలర్ డ్రెస్ లో అదిరిపోయేలా ఉంది. కానీ శృతి బరువు పెరిగి కనిపించడంతో అందరూ అవాక్కవుతున్నారు.   


పెరీనా’ వెబ్ సైట్ మ్యాగజైన్ జులై ఎడిషన్ కోసం శృతి ఈ ఫొటో షూట్ లో పాల్గొంది.. పెళ్లి కూతురు గెటప్ లోని ఈమె ఫొటోలు చూశాక ఆమె డైటింగ్ వదిలేసిందని అర్థమవుతోంది. అంతేకాదు  త్వరలోనే  తన బ్యాయ్ ఫ్రెండ్  మైకేల్ కార్సోలేను పెళ్లి చేసుకునేందుకు ఇలా రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 


ఈ మధ్య సుందర్ సి రూపొందిస్తున్న చారిత్రాత్మకమైన చిత్రం ‘సంగమిత్ర’ నుంచి తప్పుకొని శృతి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో  పెద్ద సినిమాలు ఏవీ లేవు. ఒక్క శభాష్ నాయుడు సినిమానే చేస్తోంది. ఆ సినిమా కూడా ముందుకు సాగకుండా ఉంది. కొంత కాలంగా చిత్ర షూటింగ్ లు లేకపోవడంతో శృతి బరువు పెరిగిపోయింది. సినిమాలు లేకపోవడంతో పెళ్లికి రెడీ అవుతోందని వార్తలు వస్తున్నాయి. బొద్దుగా - లావుగా కనిపించిన శృతి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com