హీరోయిన్ పూజా హెగ్డే తాజాగా హిందీ మూవీ హౌస్ ఫుల్ 4 లో నటిస్తున్నది.. ఈ మూవీలో అక్షయ్ కుమార్ హీరో. సాజిద్ ఖాన్ దర్శకుడు. ఈ మూవీ షూటింగ్ లండన్ లో కొనసాగుతున్నది.. దీని కోసం పూజా లండన్ చేరుకుంది.. అక్కడ అక్షయ్, పూజాలపై కీలక సన్నీవేశాలను షూట్ చేయనున్నారు.. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో సాక్ష్యం మూవీని పూర్తి చేసిన పూజా సూపర్ స్టార్ మహేష్ 25 వ చిత్రంలో హీరోయిన్ గా చేస్తున్నది.. ఈ మూవీకి వంశీ పైడిపల్లి దర్శకుడు.