మూవీల్లో నటించబోననే వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని హీరోయిన్ సమంత అంటున్నది. ఈ ఏడాది తొలి అర్ధభాగంలోనే రంగస్థలం,మహానటి, అభమన్యుడు మూవీ లతో హ్యట్రిక్ విజయాలను అందుకన్న సమంత చేతిలో ఇప్పుడు నాలుగు పెద్ద ప్రాజెక్ట్ లు ఉన్నాయి.. నాగ చైతన్యను వివాహం చేసుకున్న నేపథ్యంలో ఆమె మూవీలకు దూరం కానుందనే వార్తలు వెలువడుతున్నాయి.. అయితే వాటిని సమంత తోసిపుచ్చింది. ఇప్పట్లో మూవీలకు దూరం కానని స్పష్టం చేసింది..