ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా కొడుకును హీరోని చేస్తా

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 17, 2017, 03:30 PM



ప్పుడు తెలుగు సినిమాలలో కొత్త నటులు - హీరోలు పెరుగుతూ వస్తున్నారు. హీరోలు కొడుకులే కాకుండా నిర్మాత - డైరెక్టర్ కొడుకులు కూడా సినిమాలలో హీరోగా నటించి వారి వారి ప్రతిభతో ముందుకు వెళ్తున్నారు. అలానే సీనియర్ కారెక్టర్ ఆర్టిస్ట్ పిల్లలు కూడా నటులుగా మారుతున్నారు. బ్రహ్మానందం - చలపతి రావు - గిరి బాబు లాంటి సీనియర్ నటులు కొడుకులు నటులుగా డైరెక్టర్లు గా మారారు. ఇప్పుడు నటుడు కమెడియన్ శివాజీ రాజా కొడుకు కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతని కొడుకు హీరో ఎంట్రీ పై శివాజీ రాజా ఏమి అన్నాడు అంటే..


“మా అబ్బాయి విజయ్ చదువు ఈ మధ్యనే పూర్తి అయ్యింది. వాడికి నటనపై కూడా శిక్షణ ఇప్పించాను. ఇక్కడే మన హైదరాబాద్ లోనే నేర్చుకున్నాడు. వాడికి సరిపడేవి ఇప్పటి పరిస్థితి అనుగుణంగా ఉండే కథ కోసం చూస్తున్నాము. ఇద్దరు డైరెక్టర్లు కూడా వచ్చి మా వాడిని అడిగారు. రెండు కథలుగా ఓకే అనుకున్నాం. వాడిని హీరో చేయాలి అనే తొందర అయితే లేదు నాకు. ముందు కథ పై దృష్టి పెడితే అంతా మంచే జరుగుతుందిని అనుకుంటున్న. అలా అయితే వాడి యాక్టింగ్ కెరియర్కు కూడా ఉపయోగం ఉంటుంది కదా” అని చెప్పాడు.


శివాజీ రాజా ఇండస్ట్రి కి వచ్చి కొన్ని చిన్న పాత్రలు వేసి ఇప్పుడు ఇండస్ట్రిలో ఒక మంచి కారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందాడు. ఇప్పుడు అతని కొడుకు విజయ్ హీరో కాబోతున్నాడు. విజయ్ ఒక సినిమాలో బాల నటుడుగా కూడా చేశాడు. శ్రీకాంత్ హీరోగా నటించిన విరోధి అనే సినిమాలో నటించాడు. మరో విషయం ఏంటంటే ఈ సినిమాలో విజయ్ నిజ జీవితంలో తండ్రైన శివాజీ రాజా కు కొడుకు గా చేశాడు. కథ ఒకటి పక్కగా సిద్దం చేసుకునట్లు తెలుస్తుంది. అతి త్వరలో ఆ వివరాలు కూడా చెబుతాం అని అంటున్నాడు నటుడు శివాజీ రాజా.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com