దర్శకుడు శ్రీను వైట్ల మాస్ మహరాజా రవితేజ తో ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమా రూపొందిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగులో ఇలియానా జాయిన్ అయింది. రవితేజ, ఇలియానా కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.. ఇక ఈ సినిమా షూటింగు కోసం శ్రీను వైట్ల ఎక్కువ కాలం అక్కడే వుండవలసి రావడంతో, ఆయన భార్య రూప వైట్లతో పాటు పిల్లలు కూడా అక్కడికి వెళ్లారు. షూటింగులో జాయిన్ అయిన ఇలియానాకి స్పెషల్ గా వాళ్లు ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చారు. వాళ్లు చూపించిన ప్రేమానురాగాలకు ఇలియానా మురిసిపోతూ థ్యాంక్స్ చెప్పింది. అందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.