ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కళ్యాణ్ దేవ్ ను ప్రశంసించిన చరణ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 14, 2018, 11:37 AM



మెగా స్టార్ చిరంజీవి గారి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన మొదటి చిత్రం ‘విజేత’. నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఈ చిత్రం మంచి రివ్యూస్ ను సొంతం చేసుకుంది. తండ్రి , కొడుకుల మధ్య సాగె కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం కుటుంభ ప్రేక్షకులను అక్కట్టుకుంటుంది. ఇక తాజాగా ఈ రోజు ఈ చిత్రాన్ని చూసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన బావ కళ్యాణ్ దేవ్ ను అభినందించారు. ఇక ఈ రోజు ఉదయం మెగాస్టార్ చిరంజీవి కూడా చిత్ర బృందానికి అభినందలు తెలిపారు. చిత్రం అద్భుతంగా ఉందని , కళ్యాణ్ దేవ్ , మురళి శర్మల నటన ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచిందని అన్నారు.రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్ర పతాకం ఫై సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రంలో మాళవిక నాయర్ కథానాయికగా నటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com